నంద్యాల అక్టోబర్ 2
-జాతిపిత కలల సహకారం దిశగా సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాము అన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి అన్నారు.
శనివారం 152 వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్ నందు సచివాలయ ద్వితీయ వార్షికోత్సవాని. మరియు క్లప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇ షాక్ బాషా .మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా. మున్సిపల్ వైస్ చైర్మన్ లు గంగిశెట్టి వెంకట నాగ శ్రీధర్. జంగం పంషా వలి. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ లు హాజరైనారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ మాబున్నిసా. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ లు మాట్లాడుతూ
మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ నేటికి రెండు సంవత్సరములు అయినదని ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా నంద్యాల పట్టణంలో 36 సంక్షేమ పథకాలకు 545 రకాల సేవలు అందిస్తున్నామని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ గ్రామాలు క్లీన్ మున్సిపాలిటీలు క్లీన్ ఆంధ్ర స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన ప్రభుత్వం చేపడుతున్న టువంటి మహా యజ్ఞమే ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి .
ఇంటి ముందు ప్రభుత్వం కంటి ముందు పాలన ఆనే విధంగా ఈ సచివాలయంలో ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీ లోనూ గ్రామ సచివాలయ లను వార్డు సచివాలయ లను ఏర్పాటు చేసి ఉన్నారన్నారు. ఈ సచివాలయాల ద్వారా ప్రజలందరూ వారివారి ప్రాంతాలనుండి వారి సమస్యలను మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టువంటి సంక్షేమ పథకాలను సచివాలయాల నుండి పొందవచ్చునన్నారు ప్రజల సమస్యలను కూడా ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల నుండి 5 గంటల వరకూ వినతులను స్వీకరించి సత్వర పరిష్కారాలు కూడా చేపడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను నగరాలను పరిశుభ్రంగా మార్చుటకు అన్ని గ్రామాల పట్టణాల నందు ఉచిత డస్ట్ బిన్ లిచారని ఇచ్చినటువంటి 3 డస్ట్ బిన్ లలో తడి చెత్త. పొడి చెత్త. ప్రమాదకరమైన వ్యర్ధాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమం శాశ్వతముగా స్థిరంగా. నిరంతరాయంగా కొనసాగించు కోవాలని అన్నారు.
అనంతరం మన జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి చేసినటువంటి సేవలను గురించి హాజరైన వారికి పూర్తి విశదంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల సి డి పి ఓ చంద్రకళ తహసిల్దార్ రవికుమార్ వార్డ్ కౌన్సిలర్ లు కో ఆప్షన్ మెంబర్లు డాక్టర్ సుజాత. మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం మెప్మా సి యమ్ యమ్ విజయ భాస్కర్ రెడ్డి. సచివాలయ సిబ్బంది . వాలంటీర్లు. మున్సిపల్ ఇంజనీర్ రమణ డిఈ మధు తదితరులు పాల్గొన్నారు
Home ఆంధ్రప్రదేశ్ జాతిపిత కలల సహకారం దిశగా సచివాలయాలు ఏర్పాటు నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద...