Home తెలంగాణ 19,472 ఆవాసాల్లో ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటు: కేసీఆర్

19,472 ఆవాసాల్లో ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటు: కేసీఆర్

103
0

హైద‌రాబాద్ అక్టోబర్ 1
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామాల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు.. ప్ర‌శాంత‌తో పాటు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.అంటీ కాకుండా బీపీ, షుగ‌ర్ల‌తో పాటు ఇత‌ర జ‌బ్బుల‌తో బాధ‌ప‌డేవారికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారాయ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో హ‌రిత‌హారంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టిన సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.గ్రామ‌పంచాయ‌తీల్లో న‌ర్స‌రీలు ఏర్పాటు చేశాం. న‌ర్స‌రీల ఏర్పాటులో అట‌వీ అధికారుల కృషి విశేషంగా ఉంది. ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలతో చెట్ల‌ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశాం. 19,472 ఆవాసాల్లో ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటు చేయ‌బ‌డ్డాయి. 13,657 ఎక‌రాల్లో ఈ వ‌నాలు పెరుగుతున్నాయి. స‌ర్పంచ్‌ల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల‌ను స‌ర్పంచ్‌లు, మిగ‌తా అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రామాల్లో బీపీ, షుగ‌ర్‌తో బాధ‌ప‌డేవాళ్ల‌కు ఈ పార్కులు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయి.మండ‌లానికి ఒక‌టి చొప్పున బృహ‌త్ ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్నారు. 526 మండ‌ల్లాలో స్థ‌లాలు గుర్తించి 7178 ఎక‌రాల్లో ప్లాంటేష‌న్ ప‌నులు విస్తృతంగా జ‌రుగుతున్నాయి. ప‌ట్ట‌ణాల్లో 109 ఏరియాల్లో 75740 ఎక‌రాల్లో అర్బ‌న్ ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నారు. 53 అర్బ‌న్ పార్కుల్లో ప‌ని బాగా జ‌రిగింది. మిగ‌తా ప్రాంతాల్లో కూడా ప‌నులు కొన‌సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో చెట్లు న‌రికివేస్తే రూ. 4 ల‌క్ష‌ల జ‌రిమానా విధించాం. క‌ఠినంగా వెళ్తున్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.లంగాణ‌లో 2 కోట్ల 75 ల‌క్ష‌ల ఎక‌రాల‌ భూభాగం ఉంది. 66 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల పైచిలుకు అట‌వీ భూములు ఉన్నాయి. మొత్తం అడ‌వులు మాయ‌మైపోయాయి. ఉమ్మ‌డి నిజామాబాద్‌లో అద్భుత‌మైన అడ‌వులు ఉండే. కానీ మాయ‌మైపోయాయి. న‌ర్సాపూర్‌లో ఒక‌ప్పుడు ఫిలిం షూటింగ్‌లు జ‌రిగేవి. కానీ మ‌న క‌ళ్ల ముందే అడ‌వులు ధ్వంసం అయ్యాయి.అడ‌విని పున‌రుద్ద‌రించేందుకు మేధావులు ప‌లు సూచ‌న‌లు చేశారు. శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో వేర్ల ద్వారా అడ‌విని పున‌రుద్ధరించే అవ‌కాశం ఉంటుంది. 230 కోట్ల మొక్క‌లు నాటాల‌ని హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాం. 1987లో ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు సిద్దిపేట‌లో 10 వేల మొక్క‌లు నాటాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఆ మొక్క‌ల‌ను సేక‌రించేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాం. అనేక ఇబ్బందులు ప‌డి 10 వేల మొక్క‌లు సేక‌రించి నాటామ‌ని తెలిపారు. అప్ప‌ట్లో న‌ర్స‌రీలు ఉండేవి కావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం 20 కోట్ల మొక్క‌లు అడ‌వుల్లో పెట్టాల‌ని నిర్ణ‌యించాం. వేర్ల ద్వారా 80 కోట్ల మొక్క‌ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని, 100 కోట్ల మొక్క‌లు బ‌య‌ట నాటాల‌ని ప్ర‌యాణం మొద‌లు పెట్టాం. 20 కోట్ల మొక్క‌లు టార్గెట్‌గా పెట్టుకుంటే.. ఇప్ప‌టికే 20.64 కోట్ల మొక్క‌లు నాటాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలో 10 కోట్ల మొక్క‌లు టార్గెట్ పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్క‌లు నాటాం. అట‌వీ ప్రాంతాల బ‌య‌ట 130 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాట‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Previous articleఅనివార్య ప‌రిస్థితుల్లోనే అసైన్డ్ భూముల‌ను తీసుకుంటున్నాం:సిఎం కెసిఆర్
Next articleపోషకాహారలోప నివారణే లక్ష్యం పోషకాహార బోనమెత్తిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here