మద్దికేర
మండల కేంద్రమైన మద్దికేరలో వ్యవసాయ శాఖ అధికారులు మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని గురువారం రోజున ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో డి.ఎ.ఎ.టి సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ,ఏడీఏ మహమ్మద్ ఖాద్రి, ఏవో హేమలత ఆధ్వర్యంలో డి.ఎ.ఎ.టి సెంటర్ కో- ఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ మాట్లాడుతూ కంది పంటలో నల్లి పురుగు ద్వార వెర్రి తెగులు వస్తుందని తెలిపారు.ఈ తెగులు వచ్చిన ఆకులు పసుపు రంగులోకి మారి,అక్కడక్కడ పచ్చగా ఉబ్బెత్తుగా ఆకు ఏర్పడుతుందని తెలిపారు.ఈ వెర్రి తెగులు నివారణకు డైకోఫాల్ 5 మి.లీ,పొడి గంధకం 3గ్రా,కెరాథియన్ 4మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు.అలాగే ఈ క్రాప్ బుకింగ్ (పంట నమోదు) తప్పనిసరిగా చేయించు కోవాలని తెలిపారు.తర్వాత వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారా సరఫరా చేసిన వేరుశనగ మరియు కొర్ర చిరు సంచుల పొలాలను సందర్శించడం జరిగింది.కొర్ర చిరు సంచుల రకాలు ఎస్ఐఏ 3159,వేరుశనగ చిరుసంచులు టి.సి.జి.ఎస్1522 సాగు చేసిన పొలాలను సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు యోగేంద్ర, శ్రీనివాసరెడ్డి,మండల సభ్యులు గురుస్వామి, హనుమంతు,విఏఏ లు ఆనంద్,రాణి,జాకీర్, కవిత మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.