హైదరాబాద్ నవంబర్ 18
నగరంలోని కోఠి డీఎంఈ క్యాంపస్‌లో అంబులెన్స్ సేవలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో 429 108 వాహనాలు ఉన్నాయి. మరింత మెరుగ్గా 108 సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పాత వాహనాలు తొలగించి అవసరం అయిన చోట కొత్త వాహనాలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.హైదరాబాద్‌లో నాలుగు దవాఖానలను సిద్ధం చేస్తున్నాం. త్వరలో హైదరబాద్ పరిధిలో ఏర్పాటు చేయనున్న హాస్పిటల్స్‌ను సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి పేర్కొన్నారు. అలాగే గాంధీ దవాఖానలో క్యాథ్ ల్యాబ్ సేవలు పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దాదాపు 1.41 కోట్లతో ఏడు అంబులెన్స్‌లు అందజేసిన హ్యుందాయ్ సంస్థను మంత్రి అభినందించారు