బేతంచెర్ల
పట్టణంలో జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది.పట్టణంలోని మొత్తం 20 వార్డులకు గాను నామినేషన్లు ముగిసే సమయానికి అధికార పార్టీ వైసీపీ 41, టీడీపీ 64 ,బీజేపీ 09,జనసేన పార్టీ 10,సిపిఎం 04,ఇండిపెండెంట్లు 03 నామినేషన్లు దాఖలు చేశారు.కాగా శనివారం నామినేషన్ల పరిశీలన పక్రియ,8 వ తేదీ లోగా నామినేషన్ల ఉపసంహరణ,15 వ తేదీ ఓటింగ్,17 న కౌటింగ్ అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి.కాగా బేతంచెర్ల పట్టణం నగర పంచాయతీ గా అప్ గ్రేడ్ అయిన తర్వాత మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొనడం గమనార్హం