ఖమ్మం అక్టోబర్ 6
: ప్రతి అధికారి క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ స్నేహలత పిలుపు నిచ్చారు.. భారత ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “క్లీన్ ఇండియా క్యాంపెన్” లో భాగంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేహ్రు యువ కేంద్రం యూట్ సమన్వయకర్త అన్వేష్ అధ్యక్షతన జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ సేకరించి నిర్వీర్యం చేసే పద్దతిని తమశాఖల ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు.క్లీన్ ఖమ్మం జిల్లాగా పేరు తెచ్చుకునేందుకు జిల్లా అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం క్లీన్ ఇండియా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్తలు, యూత్ క్లబ్ ప్రతినిధులు, అడ్వజరీ కమిటీ సభ్యులు, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతీ, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్‌డీవో విద్యాచందన, డీపీవో ప్రభాకర్‌రావు, డీఈవో యాదయ్య, జిల్లా క్రీడాలధికారి పరందామరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.