Home తెలంగాణ ప్రతి ఒక్కరూ సమాచారాన్ని తెలుసుకోవాలి – సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు...

ప్రతి ఒక్కరూ సమాచారాన్ని తెలుసుకోవాలి – సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బొల్లం మధుబాబు

220
0

పెద్దపల్లి డిసెంబర్ 02

ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించే హక్కు ఉంటుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బొల్లం మధుబాబు అన్నారు. ఈ మేరకు గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అదేవిధంగా రామగుండం కార్పోరేషన్ లో గాని ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు లేనిదే అధికారులు పనులు చేయడం లేదని పేర్కొన్నారు. ఇదే క్రమంలో గత మూడు మాసాల కాలంలో పెద్దపల్లి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్ ఇన్ చార్జి కమిషనర్ (పెద్దపల్లి ఆర్డిఓ) శంకర్ కుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారని అన్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులు ప్రజలు ఆయా కార్యాలయాల్లో జరిగే వ్యవహారాలు అభివృద్ధి పనుల లెక్కలు తెలుసుకోవడానికి సమాచార హక్కు దోహదపడుతుందని పేర్కొన్నారు. లంచం తీసుకునే అవినీతి అధికారులను నిలదీయాలి అన్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు లంచావతారం ఎత్తి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం క్షమించరని అన్నారు. ఇలాంటి లంచగొండి అధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతిని బయట పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మామిడి, రామగుండం నియోజకవర్గ కన్వీనర్ తోట వెంకటేష్, పాఠశాల డైరెక్టర్ పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి, మంజుల, ప్రధానోపాధ్యాయులు నోముల రాజిరెడ్డి, ఉపాధ్యాయులు జంగ రవి, పెంట శ్రీధర్, కిన్నెర లక్ష్మీపతి, హైమద్ పాషా, సునీల్, ప్రేమ్, కృష్ణ, జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు.

Previous articleఉపఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ పోరిక రవీందర్
Next articleపోటీ పరీక్షల అభ్యర్థులకు కర దీపిక ప్రచురణలు పీ.హెచ్.డీ స్కాలర్స్ కు ప్రచురణలను బహూకరించిన బోయినపల్లి వినోద్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here