మందమర్రి. అక్టోబర్ 07
సింగరేణి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి తప్పని సరిగా అవగాహన కలిగి ఉండాలని, అందరూ రక్షణ చర్యలు పాటిస్తూ ఉత్పత్తిని సాధించాలని అప్పుడే ప్రమాద రహిత గనిగా ఆర్ కె 6 గుర్తింపు లభిస్తుందని దానికి అందరూ కృషి చేయాలని ఆర్ కె 6 గని మేనేజర్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
గురువారం ఆర్ కె 6 గనిలో మేనేజర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.గురువయ్య ఏజిఎం.కొత్తగూడెం, బళ్ళారి శ్రీనివాస్.జిఎం. సేఫ్టీ బెల్లంపల్లి రీజియన్,జి.మల్లేష్.ఎఎస్ఓ.శ్రీరాంపూర్, ఆదేశాల మేరకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పైన ఉద్యోగులకు పూర్తి అవగాహన ఉండాలని వారు కోరారు అని మేనేజర్ తెలిపారు.అనంతరం ఉద్యోగులకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పై ప్రశ్నల పరీక్ష పోటీ నిర్వహించి సంతోష్ కుమార్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి కాదాసి శ్రీనివాస్, సంక్షేమ అధికారి.సునిల్ కుమార్,వివో రామ్ నర్సయ్య,ఫిట్ ఇంజనీర్ శ్యామ్ కుమార్, డిప్యూటీ మేనేజర్ మర్రి కొమరయ్య, ఇంజనీర్ మహేష్, షిఫ్ట్ ఇంచార్జి చంద్ర ముర్మ్,టిబిజికెఎస్ నాయకులు చిలుముల రాయమల్లు, లక్ష్మి నారాయణ,అడ్డు శ్రీనివాస్,ఇప్ప భూమయ్య,రామ్ అవదేశ్ కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.