కడప సెప్టెంబర్19
కడప నగరం 48 డివిజన్ కృపా కాలనీ న్యూ నేటివ్ కృపా చర్చి లో పాస్టర్ పి.మహేష్, సిస్టర్ శాంతమ్మ గార్ల అధ్వర్యంలో కడప జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పుల్లురు శ్రీనివాసులు, బిషప్ డానియల్, మల్లెం విజయ్ భాస్కర్, యం. సత్యమయ్య , పి. లాజరస్, కే. ఆనంద్, వై.వినోద్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వీరు మాట్లాడుతూ నాడు మంత్రీకుడు నేడు ఆధ్యాత్మిక సేవకునిగా పి.మహేష్ ఈ ప్రాంతంలో దైవ పరిచర్య చేస్తూ మానవుని సమస్యలకు ఆధ్యాత్మిక జీవితమే చెరణ్యమని కర పత్రికలను రచించి ఎడిటింగ్ గా డాక్టర్ పి.లాజరస్ సమకుర్పుతో ఈ పది వేల పత్రికలను విడుదల చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో మేలు కారంగా వుండేందుకు రచించిన పాస్టర్ పి.మహేష్, సిస్టర్ శాంతమ్మ గార్లను జెఏసి పెద్దలు అభినందించారు. పాస్టర్ పి.మహేష్ మాట్లాడుతూ మానవుడు సమస్యతో వున్నప్పుడు చెడు వ్యసనాలు, మాదక ద్రవ్యాలు అల్కహలు వంటివి సమాధాన పరచవని ప్రతి ఒక్కరూ జీవితము ఆధ్యాత్మిక జీవితంలోనే శాంతి, సమాధానం వున్నదని, త్రాగుడు చెడు వ్యసనాలతో వున్న నా జీవితాన్ని మార్చింది ఆధ్యాత్మిక జీవితమేనని వర్ణించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ పి. రవితేజ, శాంతి రాజు, రోజా, లీలావతి సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ ప్రాంతంలో కరపత్రాలు పంచారు.