జగిత్యాల నవంబర్ 19
జిల్లాలోని రైస్ మిల్లులలో వడ్ల దిగుమతులను శుక్రవారం జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ (సీఎస్) ఖాదర్ లు పరిశీలించారు. జిల్లాలోని రైస్ మిల్లులందరికి డీసీఎస్ ఓ చందన్ కుమార్ జూమ్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా చందన్ కుమార్ మాట్లాడుతూ మిల్లర్లు వడ్లను దిగుమతి చేసుకోవడానికి తగిన సామర్థ్యం గల గోడౌన్ లను ఏర్పాటు చేసుకోవాలని,ధాన్యాన్ని భద్రపరచాలని సూచించారు . వడ్లు దిగుమతులు అయిన వెంటనే మిల్లింగ్ చేసి బియ్యాన్ని అప్పచేప్పాలని మిల్లర్లను ఆదేశించారు.ఈజూమ్ మీటింగ్ లో డిప్యూటీ తహసీల్దార్ (సీఎస్) ఖాదర్ తదితరులతో పాటు జిల్లాలోని మిల్లర్లు పాల్గొన్నారు.