Home జాతీయ వార్తలు 2022 మార్చి వ‌ర‌కూ ఉచిత రేష‌న్ ప‌ధ‌కం పొడిగింపు

2022 మార్చి వ‌ర‌కూ ఉచిత రేష‌న్ ప‌ధ‌కం పొడిగింపు

137
0

న్యూఢిల్లీ నవంబర్ 24
ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న(జీకేఏవై) పేరిట అందించే ఉచిత రేష‌న్ ప‌ధ‌కాన్ని 2022 మార్చి వ‌ర‌కూ పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధ‌వారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌ధ‌కం కింద 80 కోట్ల మందికి జాతీయ ఆహార‌భ‌ద్ర‌త చ‌ట్టం కింద ప్ర‌భుత్వం 5 కిలోల బియ్యం, గోధుమ‌ల‌ను ఉచితంగా అంద‌చేస్తుంది.జీకేఏవై ప‌ధ‌కాన్ని వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కూ పొడిగించాల‌ని కేంద్ర క్యాబినెట్ భేటీ నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్‌-19 క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌లు విధించ‌డంతో పేద‌లు జీవ‌నోపాధిని కోల్పోవ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది పీఎం-జీకేఏవైని జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం ల‌బ్ధిదారుల కోసం ప్ర‌క‌టించింది.

Previous articleమహబూబ్‌నగర్‌ శాసన మండలి సభ్యుల ఎన్నికలలో6 నామినేషన్లు తిరస్కరణ
Next articleవివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here