నిజామాబాద్
నిజామాబాద్ లో బిజెపి నేత వివాహేతర సంబంధం కలకలం రేపింది. ఆకుల శీను కొంత కాలంగా మా కూతురికీ మాయ మాటలు చెప్పి మోసం చేశాడని యువతి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేసారు. తన కూతురిని మోసం చేశాడంటూ వినాయక నగర్ లోని బీజేపీ కార్పొరేటర్ భర్త ఇంటిముందు బాధితులు ఆందోళన కు దిగారు. గతంలోనూ మందలించినా బిజెపి కార్పొరేటర్ భర్త తీరు మారలేదని ఆరోపించారు. మంగళవారం రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీను ను అమ్మాయి తల్లిదండ్రులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. మాకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల వేడుకుంటున్నారు. బిజెపి కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటిపై అమ్మాయి తల్లిదండ్రులు దాడికి దిగారు. ఆకుల శీను పై కుడా దాడి చేసారు. ఎత్తుకెళ్లిన అమ్మాయిని కాంగ్రెస్ సర్పంచ్ శేఖర్ గౌడ్ ఇంట్లో ఉంచినట్ఉ సమాచారం. మా అమ్మాయిని అప్పగించాలంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు.