Home నగరం దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పరిణ‌యం’ ట్రైల‌ర్ విడుద‌ల

దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పరిణ‌యం’ ట్రైల‌ర్ విడుద‌ల

112
0

లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, పాత్ బ్రేకింగ్ వెబ్ షోస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఛానెల్ ‘ఆహా’. ఇప్పుడు జీవితంలో మ‌నమంద‌రం ఎంజాయ్ చేసే కామెడీ అంశాల‌తో హృద‌యానికి హ‌త్తుకునేలా రూపొందిన‌ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ప‌రిణయం’ చిత్రం సెప్టెంబర్ 24న ‘ఆహా’లో ప్రీమియ‌ర్ కానుంది. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభ‌న,ఊర్వ‌శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అనూప్ స‌త్య‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ‘వ‌ర‌ణే అవ‌శ్య‌ముంద్’  చిత్రాన్ని ఆహా పరిణయం పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుల చేశారు. గుండెను తాకేలా ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో ఎంట‌ర్‌టైనింగ్‌గా ‘ప‌రిణ‌యం’ మూవీ రూపొందింద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.
సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా ఈ ట్రైల‌ర్‌లో చూడొచ్చు. సింగిల్ మ‌ద‌ర్ నీనా, ఆమె కుమార్తె నికిత‌, వారి స‌మీపంలో ఉండే ఇరుగుపొరుగువాళ్లు, సామాజిక‌మైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న‌ మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్‌, సంతోషంగా ఉండే అదృష్ణ‌వంతుడైన యువ‌కుడు అత‌నికి ఫ్రాడ్ అనే నిక్ నేమ్ కూడా ఉంటుంది. అత‌ను సింగిల్ మ‌ద‌ర్‌, ఆమె కుమార్తె ఉండే ప‌క్క అపార్ట్‌మెంట్‌లోనే ఉంటుంటాడు. ‘ప‌రిణ‌యం’  అనేది పెద్దలు కుదిర్చిన వివాహాలు, సింగిల్ పేరెంట్ అయిన మ‌హిళ ఎదుర్కొనే స‌మ‌స్య‌లు, ఆమె మ‌ధ్య వ‌య‌సులో ప్రేమ‌ను కోరుకోవ‌డం .. ఇలా మ‌న చుట్టూ చాలా మంది జీవితాల్లో ఉండే అనేక స‌మ‌స్య‌ల‌ను గురించి తేలికైన పంథాలో తెలియ‌జేస్తూ సాగే సినిమా. మ‌ధ్య త‌ర‌గ‌తి నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించారు. మ‌నుషుల మ‌ధ్య ఉండే బంధాలు, అనుబంధాల‌ను ఏదో బ‌లంగా చెబుతున్న‌ట్లు కాకుండా తేలిక‌గా,  కొత్త కోణంలో, సెన్సిబుల్‌గా తెలియచేసేలా రూపొందించారు.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టించిన దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. అలాగే ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సురేశ్ గోపి, శోభ‌న‌, ఊర్వ‌శి, కేపీఏసీ ల‌లిత త‌దిత‌రులలో స‌మ‌తూకంగా చేసిన బ్యాలెన్స్‌డ్ పెర్ఫామెన్‌సెస్ ఆకట్టుకుంటాయి. దీంతో పాటు న‌టీన‌టుల మ‌ధ్య సాగే రొమాన్స్‌, ఆక‌ట్టుకునే హాస్యంతో పాటు ఆల్ఫోన్స్ జోసెస్ చ‌క్క‌టి సంగీతం మెప్పిస్తుంది. ముఖేష్ ముర‌ళీధ‌రన్ అందించిన విజువ‌ల్స్‌, టోబీ జాన్ ఎడిటింగ్ ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమా అనుభ‌వాన్ని అందిస్తాయి.
‘ప‌రిణ‌యం’కు మ‌ల‌యాళ మాతృక ‘వరణే అశ్యముంద్’ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఆహ్లాదాన్ని అందించిన చిత్రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుంది. 2021 ఏడాదిలో ‘ఆహా’ … క్రాక్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, కుడి ఎడ‌మైతే, త‌ర‌గ‌తిగ‌ది దాటి, ది బేక‌ర్ అంద్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాలు, వెబ్ షోస్‌ల‌తో ప్ర‌తి ఒక తెలుగువారి ఇంట తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ భాగ‌మైంది.

Previous articleకడప జడ్పీ చైర్మన్ గా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఎన్నిక
Next articleబీస్ట్’ నెల్సన్ దర్శకత్వంలో ‘డాక్టర్ వరుణ్’ గా శివ కార్తికేయన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here