కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లింగంపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి చెందాడు. ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య (57) గుండెపోటుతో ధాన్యం కుప్పపై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కొనుగోళ్ల ఆలస్యం కారణంగా రైతులు ధాన్యం కుప్ప వద్ద నిద్రిస్తోన్నారు. రైతు బీరయ్య మృతి తో మిగతా రైతులు ఆందోళన కు దిగారు.