జగిత్యాల సెప్టెంబర్ 25
కాలాన్ని బట్టి రైతులు పంట మార్పిడి చేయాలని జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు సూచించారు. శనివారం మేడిపల్లి మండలంలో పోరుమల్ల గ్రామంలో యాసంగిలో పంటల మార్పిడి మరియు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు హజరై ఆయన
మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని , కాబట్టి కాలాన్ని బట్టి రైతు పంట సాగు చేయాలని ఆయన ఆన్నారు.ఒక వరిధాన్యం పొలం, కాకుండా వివిధ పంటల మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని , కావున వివిధ పంటల మార్పిడి పై రైతులు ఆలోచన చేయాలని , ఆయిల్ ఫామ్, చెరుకు, వేరుశనగ, కూరగాయల పంటలు వివిధ రకాల పంటలపై జడ్పీ వైస్ చైర్మన్ రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమా దేవి- రాజా రత్నాకర్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ శ్రీపాల్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు భూమా రెడ్డి, మండల అగ్రికల్చర్ అధికారి త్రీవేదిక, సర్పంచ్లు తిరుపతి రెడ్డి, నారాయణరెడ్డి, సంపత్ కుమార్,ఎంపీటీసీ లావణ్య-రాజేందర్ రెడ్డి, ముఖ్య నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.