Home తెలంగాణ రైతులు భూముల క్రయ విక్రయాలలో జాగ్రత్తలు వహించాలి రాజీ మార్గమే రాజ మార్గం: న్యాయమూర్తి...

రైతులు భూముల క్రయ విక్రయాలలో జాగ్రత్తలు వహించాలి రాజీ మార్గమే రాజ మార్గం: న్యాయమూర్తి ప్రతీక్ సిహాగ్ బుగ్గారంలో అజాది కా అమృత్ మహోత్సవ్ హాజరైన న్యాయమూర్తి ప్రతీక్ సిహాగ్

111
0

జగిత్యాల అక్టోబర్ 08
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని పోచమ్మ కళ్యాణ మండపంలో శుక్రవారం ఆజాది కా అమృత్  మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోర్టు పరిధిలోని మండల లీగల్ సర్వీస్ అధ్వర్యంలో  జరిగిన ఈ చట్టాలపై అవగాహన సదస్సుకు ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రతీక్ సిహాగ్ హాజరై ప్రసంగించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతులపాటి వెంకటరమణ న్యాయవ్యవస్థలో అనేక సవరణలు తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. రైతులు భూముల క్రయ విక్రయాలలో చట్టపరమైన చాలా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. రైతులకు సరైన అవగాహన లేకనే భూగాధాలతో అత్యధిక కేసులు కోర్టుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ పూర్తిగా నేరమని అలాంటి నేరాల ద్వారా యువత కేసుల్లో ఇరుక్కొని తమ భవిష్యత్ చెడగొట్టు కోవద్దని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మొట్టమొదటి సారిగా గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో జరుగుతున్న ఈ చట్టాలపై అవాగాహన కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్చందంగా తరలి వచ్చి చట్టాల గురించి పూర్తిస్థాయిలో చైతన్యం పొందాలని ఆయన కోరారు. రాజీ మార్గమే రాజ మార్గం అని రాజకీయాలతో వివాదాలకు పోకుండా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే  మంచిదని ఆయన పేర్కొన్నారు.
మండల లీగల్ ప్యానల్ అడ్వకేట్ మామిడాల శ్రీకాంత్ కుమార్, ఇంచార్జ్ దుమ్మెన శ్రీనివాస్ లు సభ విజయ వంతానికి కో-ఆర్డినేషన్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాండ్ర సురేందర్ మాట్లాడుతూ వినియోగదారుల కు కలిగే నష్టాలు – కష్టాలపై అవాగాహన కల్పించారు. వినియోగదారుడై ఉండి నష్టపోతే వినియోగదారుల పోరాన్ని ఆశ్రయించి తగిన నష్ట పరిహారం పొందవచ్చని సూచించారు. ఏడాది లోగా బుగ్గారం గ్రామం నేర రహిత గ్రామంగా పేరు గాంచాలని ఆయన ఆకాక్షించారు. ప్రజలకు తగిన న్యాయ సలహాలు అందించేందుకు మా లీగల్ సెల్ సిద్ధంగా ఉందని, ఈ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.  సీనియర్ న్యాయవాది, మాజీ ఏపిపి బెత్తపు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలు సమస్యల్లో చిక్కుకోకుండా, చట్టపరంగా ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకే ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు అని అన్నారు. చట్టపరంగా ప్రజలను చైతన్య పరచి ఉత్తేజపర్చడానికి న్యాయమూర్తులు గ్రామాలకే తరలి రావడం గొప్ప శుభదాయకం అన్నారు. రాజకీయ బందీలో అధికారులు, పోలీసులు ఇబ్బందులు పడాల్సి వస్తోన్న మాట వాస్తవం అని తెలిపారు. రాజకీయంగా అలాంటి ఒత్తిళ్ళు లేకపోతే పాలనా వ్యవస్థ సులభంగా ఉంటుందని అన్నారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, తప్పు చేసిన వారు చట్టపరంగా శిక్షకు బాధ్యులేనని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ల ఆవశ్యకత లపై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. యువతకు, ప్రజలకు లైసెన్స్, అన్ని రకాల వాహన పత్రాలు ఉండేలా ఒక ప్రత్యేక అవాగాహన సదస్సు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీస్ అధికారులను కోరారు. దానికి న్యాయ సలహాలు ఇవ్వడానికి బార్ అసోసియేషన్ పక్షాన బాధ్యత తీసుకుంటామని అన్నారు. ప్రముఖ న్యాయవాది దుమ్మెన శ్రీనివాస్ మాట్లాడుతూ వారసత్వ హక్కు చట్టంపై ప్రజలను చైతన్య పరిచారు. ఈ చట్టం 1956లో  అమలులోకి వచ్చిందన్నారు. ప్రముఖ న్యాయవాది మామిడాల శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతూ భార్యాభర్తల తగాదాలు, గృహహింస, వరకట్నం, రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ వలన కలిగే ప్రయోజనాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. సఖీ సోషల్ వర్కర్ అశ్విని మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, నిర్భయ చట్టం లపై మహిళలకు అవాగాహన కల్పించారు. బుగ్గారం ఎస్సై ఉపేంద్రా చారి మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉంటేనే నేరాలు, కేసులు తగ్గుతాయని అన్నారు. చట్టాలను గౌరవిస్తూ ప్రజలు పోలీసులకు, ఇతర శాఖల అధికారులకు సహకరించినప్పుడే  సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నేటి యువత ముఖ్యంగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి జంగిలి మల్లిఖార్జున్, న్యాయవాదులు మసర్ధి భాస్కర్, పొలంపెళ్లి లక్ష్మణ్, రౌతు రాజేష్, బందెల రమేష్, కంచి సురేష్, ఎ. రమేష్ లు హాజరై ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.
జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా.శ్రీనివాస్, బుగ్గారం తహశీల్దార్ ఎం…

Previous articleచట్టాలపై అవగాహన కలిగిఉండాలి చిప్పమనోహర్..
Next articleబాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here