పత్తికొండ టమోటా మార్కెట్ ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరిశీలించి రైతులు,వ్యాపారులతో మాట్లాడారు. సరుకు ఎక్కువగా వస్తుండడంతో గత 2 రోజులు గా కొద్దిగా ధరలు తగ్గాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే వ్యాపారుల కు అధికారులకు సూచించారు. అనంతరం మార్కెట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఇసుక డంపింగ్ యార్డు ను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇక్కడి నుంచి ఇసుక సరఫరా చేస్తామనీ తెలియజేశారు. అధికారులు, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.