జగిత్యాల, అక్టోబర్ 08
జిల్లాలో 2021-22 వానాకాలం పంటలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో రాబోయే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో పత్తి కొనుగోలు, తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి (సీసీఐ) కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కనీస మద్దత్తు ధరకు పత్తి కొనుగోలు జరగాలని, జిల్లాలో 2021-22 వానాకాలంలో రైతులు సాగుచేసే పత్తిపంటపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలో పత్తి 8480 హెక్టార్ల విస్థీర్ణంలో సాగు జరిగి 16990 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారుల అంచనా మేరకు, రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎటవంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖలవారిగా చేపట్టవలిసిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, పతినిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తు ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని, కొనుగోళ్ల పై తీసుకునే చర్యలపై నివేదికలను సిద్దం చేస్తూ ఎప్పటికప్పు సమర్పించాలని సూచించారు. ఈకార్యక్రమం అనంతరం 2020-21 సంవత్సర కనీస మద్దతు ధర మరియ పత్తి నాణ్యత ప్రమాణాలు ఎంసీపీ గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా మార్కెట్ అధికారి డి. ప్రకాశ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. సురేష్, జిల్లా తునిఖలు మరియ కొలతల శాఖ అధికారి అజీజ్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగా రావు, పత్తి మిళ్లు ట్రెడర్స్ రాంబాబు, సిసిఐ అధికారి రజినికాంత్ మోరే, మార్కెట్ సెక్రటరి, విద్యూత్, రవాణ శాఖ ఆధికారులు పాల్గోన్నారు.