ములుగు నవంబర్ 17
ధాన్యం కొనుగోళ్లను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి
రైతులందరు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సింగిల్
విండో చైర్మన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డి సి సి బి డైరెక్టర్ మాడుగుల రమేష్ అన్నారు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప లోని నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ పాపయ్యపల్లి. కేశవాపూర్ తిమ్మాపూర్ ఎక్స్ రోడ్.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున సింగిల్ విండో సొసైటీ చైర్మన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డి సి సి బి డైరెక్టర్ మాడుగుల రమేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఆరే విజేందర్ పాలకవర్గ సభ్యులు మేకల ఇంద్ర రవి
ఏ ఓదెలు సొసైటీ సీఈఓ గుర్రం దిలీప్ సిబ్బంది బి రాజయ్య వేల్పుగొండ రామకృష్ణ రైతులు మూడేళ్ల స్వామి ఓదెలు రామచందర్ పులి రాజా వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు