నిర్మల్,
రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. సారంగాపూర్ మండలం లోని ఆలూర్ గ్రామం లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లో మొట్ట మొదటిసారి గా ఆలూర్ లో ప్రారంభించుకున్నామని,
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరాలను గుర్తించి అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.
రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని రైతులకు వివరించారు.
జిల్లా లో గతంలో కంటే వరి సాగు చాలా పెరిగిందని, ఈ సీజన్ లో 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 23 లక్షల క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని మంత్రి తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్ళకు రూ. 427 కోట్ల అంచనా వ్యయం అవుతుందని పేర్కొన్నారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి తాళ్ళు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, అందువల్ల కటింగ్ లు లేకుండా, ట్రాన్స్పోర్ట్ కు ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలిపారు.
ధాన్యం శుభ్రంగా రావాలంటే హార్వెస్టర్ లో మార్పులు తేవడం వలన, పాడి క్లినర్లు వాడడం వలన ధాన్యం శుభ్రంగా వస్తుందని అన్నారు.
వచ్చే యాసంగి లో దాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కోనడం లేదని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని, మార్కెట్ లో దేనికి మంచి ధర లభిస్తుందో తెలుసుకొని, వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేయడం, రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రబీ సీజన్ లో 2021-2022 సంవత్సరానికి ప్రభుత్వం కనీస ధర క్వింటాలుకు ఏ గ్రేడ్ 1960/-, కామన్ గ్రేడ్ 1940/- నిర్ణయించిందని అన్నారు. రైతులు మద్దతు ధర పొందెందుకు ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా నెంబర్, మొబైల్ నెంబర్ భూ వివరాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు రెవెన్యు పి. రాంబాబు, స్థానిక సంస్థలు హేమంత్ బోర్కడే, డి సి సి బి రఘనందన్ రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, చైర్మన్ మాణిక్ రెడ్డి సర్పంచ్ రాధ, జడ్పీటీసీ, రైతు బందు అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు