శ్రీకాళహస్తి
ముక్కంటి దర్శనార్డం వచ్చే భక్తుల కు పాతాళ గణపతి ని దర్షించుకునే అవకాశాన్ని అదికారులు కల్పించారు. కరోనా తీవ్రత నేపధ్యంలో సుమారు 15 నెలలగా భక్తులను ఇక్కడి ఆలయం లోకి అనుమతించడం లేదు. భక్తుల ను ఆకట్టుకునే ఈ పాతళ వినాయక స్వామి దర్శనానికి సోమవారం నుంచి భక్తులను అనుమతించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి నిరీక్షించి గణనాధుడిని దర్శించుకున్నారు.