కామారెడ్డి నవంబర్ 24
దేశంలో హిందు, ముస్లిం ల మధ్య ఉన్న ఐక్యమత్యాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్న ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ వసీం రజ్వీ పై కేసు నమోదు చేయాలంటూ
ఎంఐఎం పార్టీ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు. రజాక్ ఆధ్వర్యంలో బుధవారం
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని డిఎస్పి కార్యాలయం లో డిఎస్పీ శంశాంక్ రెడ్డికి వసీం రజ్విపై కేసు నమోదు చేయాలని డిఎస్పీ శశాంక్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు.
వసీం రజ్వి పైన ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. వసీమ్ రజ్వి గతంలో కూడా భారతదేశంలో ఆ శాంతి నెలకొల్పేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
యతి నరసింహనంద సరస్వతి స్వామితో కలిసి వీడియో రికార్డింగ్లో ముస్లింల దైవప్రవక్త గురించి లేనిపోని అబద్ధాలు చెప్పి ముస్లిం సమాజం పైన అబండాలు మోపుతున్నారన్నారు. భారతదేశంలో ప్రశాంతంగా ఉంటున్నా హిందూ, ముస్లింల మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, దేశంలో లా అండ్ ఆర్డర్ కు ముప్పు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు