Home తెలంగాణ నిరుపేద విద్యార్థినికి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం

నిరుపేద విద్యార్థినికి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం

217
0

ములుగు నవంబర్ 24

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యా వికాసానికి సహాయ సహకారాలు అందిస్తున్న ములుగు లయన్స్ క్లబ్ వారి సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కొనియాడారు.
బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో లైన్స్ క్లబ్ సభ్యులు కలెక్టర్ ను కలిశారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గిరిజన విద్యార్థిని సమ్మక్క ఉన్నత చదువులు చదివి రాయపూర్ లో ఎన్ .ఐ. టి లో సీటు వచ్చిందని  పేదరికం కారణంగా అడ్మిషన్స్ పొందలేక పోవుటకు  వారికి సహాయార్థం అడ్మిషన్స్ పొందుటకు ఆర్థిక సహాయం నిమిత్తం ములుగు  లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  విద్యార్థినికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ద్వారా అందజేశారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూజేఈఈ మెయిన్స్ లో 41 65 ర్యాంకు సాధించిన విద్యార్థినికి      సహాయం నిమిత్తం  ముందుకొచ్చి విరాళం అందించినందుకు వారిని ఎంతగానో   అభినందించారు.

ఈ యొక్క కార్యక్రమంలో  తాడువాయి  తహసీల్దార్  ములుగు లయన్స్ క్లబ్ మెంబర్ ముల్కనూర్ శ్రీనివాస్,  ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో జన్ను శ్యామ్,గంగిశెట్టి మోహన్ ప్రసాద్, లయన్ గంగిశెట్టి శ్రీనివాస్, ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానికొమ్ము  రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు చుంచు రమేష్. ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Previous articleవరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మేయర్ స్రవంతి
Next articleవసీం రజ్విపై కేసు నమోదు చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here