జగిత్యాల,నవంబర్ 10
జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంప్ లో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాల్మీకి ఆవాసానికి రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన అత్తినేని వేణు – నిత్య దంపతులు రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామీణ,నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాల నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు సేవ భారతి ఆధ్వర్యంలో ఉచితంగా భోజన వసతి కల్పిస్తూ సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్న శ్రీ వాల్మీకి ఆవాసానికి పలువురు దాతలు సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా వేణు – నిత్య దంపతుల కుమారుడు అత్తినేని నందన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవాస విద్యార్తుల పాఠశాల ఫీజుల కోసం రు.20,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆవాస నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రీ వాల్మీకి ఆవాసానికి ఎంతోమంది దాతలు వివిధ రూపాల్లో సహకరిస్తున్నారని,వారందరికీ ఆవాస విద్యార్థుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆవాస సహా కోశాధికారి ఎలగందుల కైలాసం,ఆవాస ప్రముఖ్ మల్లేశం,వేణు కుటుంభ సభ్యులు పాల్గొన్నారు.