మందమర్రి.నవంబర్ 01
శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి (శ్వాస్) ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
అక్టోబర్ 29, 30,31తేదిల్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఉభయ వేదాంత సభలు ముచ్చింతల్, జీయర్ స్వామివారి ఆశ్రమంలో ఆదివారం రాత్రి దిగ్విజయంగా ముగిసాయి.ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి లబ్ధప్రతిష్టులైన పండితులు, పెద్దలు, అపర రామానుజులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవానాథ రామానుజ జీయర్ స్వామి లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శ్వాస్ వెబ్సైట్, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలలో ప్రతిరోజు సుమారుగా 300 మంది శ్రీవైష్ణవ సంప్రదాయ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారని సమితి సభ్యులు తెలియజేశారు.ఈ వార్షికోత్సవ వేడుకల్లో సమితి కార్యవర్గ సభ్యులు మంగళగిరి యాదగిరి స్వామి, అధ్యక్షులు, పీతాంబరం వెంకట కిషోర్, ప్రధాన కార్యదర్శి, కందాల వరదాచార్యులు, కోశాధికారి, సౌమిత్రి శ్రీధరాచార్యులు, ఉపాధ్యక్షులు, మంచిర్యాల జిల్లా నుండి గోవర్ధనగిరి నర్సింహా చార్యులు,డింగరి కృష్ణకాంతాచార్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.