నిజామాబాద్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో వర్ష ప్రభావాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఎస్సారెస్పీ ప్రాజెక్టు కు ఎగువ నుంచి అధిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో డ్యాం దగ్గరికి చేరుకుని ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో పై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…నేతలందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల్లో వర్షాలపై అధికారులతో క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తున్నాం.ఇప్పటి వరకు పరిస్థితులు పూర్తిగా మా కంట్రోల్ లోనే ఉన్నాయి. అధికారులు ఎక్కడివారక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉన్నారు.ఎస్సారెస్పీ కి,నిజాం సాగర్ కు ఎగువ నుండి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఎస్సారెస్పీ కి కౌలాస్ నాల,మంజీరా నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నది. డ్యామ్ మీదనే వరద పరిస్థితులపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.ఔట్ ఫ్లో ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్నందు వల్ల మత్స్యకార్మికులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ చెప్తున్నందున ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకూడదని కోరుతున్న.అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి. తహసీల్దార్ లు,ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎస్.ఐ లు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలి. చెరువులు,రోడ్లు,బ్రిడ్జ్, కల్వర్టు లు నిత్యం పరిశీలించి అప్డేట్ ఇవ్వాలి.జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం.కామారెడ్డి జిల్లాలో కంటే నిజామాబాద్ జిల్లాలో వర్షం ఎక్కువగా కురిసింది.నిజామాబాద్ జిల్లాలో కూడా బాల్కొండ, నిజామాబాద్ రూరల్,ఆర్మూర్ ఒక పార్ట్ ఎక్కువ వర్షపాతం నమోదైంది.ఈ వర్షాల వల్ల రైతులు పంట నష్టపోయారు.ప్రభుత్వానికి నష్ట పోయిన పంట అంచనా వేసి నివేదిస్తాం.అందరూ సమన్వయం తో పనిచేయాలి. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరుతున్న. నేను స్థానికంగా అందుబాటులోనే ఉంటా..ఏ నిమిషమైన ఫోన్లో సంప్రదించవచ్చు.”అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.అంతకు ముందు మహారాష్ట్ర లో గోదావరి పై ఉన్న బాలేగావ్ మరియు విష్ణుపురి ప్రాజెక్ట్ అధికారులతో మంత్రి మాట్లాడి అక్కడి నుండి వస్తున్న ఔట్ ఫ్లో,కురుస్తున్న వర్షాలు, వరద గురించి అడిగి తెలుసుకున్నారు..నిజామ్ సాగర్,కౌలాసనాల,గద్దెన్న వాగు నుండి మంజీరా లో వస్తున్న వరద పై బోధన్ ఆర్డీఓ తో మంత్రి ఫోన్ లో మాట్లాడి సమీక్షించారు మంత్రి వెంట ఆర్.డి. ఓ శ్రీనివాసులు, ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్,బాల్కొండ నియోజకవర్గ మెండోరా,ముప్కాల్ మండల పార్టీ అధ్యక్షులు నగంపేట్ శేఖర్ రెడ్డి,భూమేశ్వర్, జెడ్పిటిసి లు గంగాధర్,నర్సారెడ్డి,ఎంపిపిలు పద్మ వెంకటరెడ్డి,బురుకల సుకన్య కమలాకర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..