Home జాతీయ వార్తలు ఓఎన్జీసీ బకాయిలకోసం మత్స్యకారుల నిరసన

ఓఎన్జీసీ బకాయిలకోసం మత్స్యకారుల నిరసన

232
0

యానం
ఓఎన్జీసీ  నష్టపరిహార బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సముద్రంలో యానం మత్స్యకారులు నిరసనకు దిగారు. ఓ ఎన్ జి సి కార్యకలాపాలను అడ్డుకున్నారు. నిషేధ సమయంలో ఆనాటి జీఎస్పీసీ,  నేటి ఓ ఎన్ జి సి సంస్థ యానం మత్స్యకారులకు ఇవ్వాల్సిన నష్టపరిహార బకాయిలను ఇవ్వకపోవడానికి నిరసనగా వారంతా సముద్రంలో ఆ సంస్థ కార్యకలాపాలను అడ్డుకున్నారు. 2019లో అప్పటి జి ఎస్ పి సి చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో వేట నష్టపోయిన యానాం మత్స్యకారులకు పరిహారం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 13 నెలలు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం ఆరు నెలలు మాత్రమే పరిహారం ఇచ్చి మిగిలినది నిలిపివేశారు. అప్పటి నుండి పలు దఫాలుగా పరిహారం కోసం మత్స్యకారులు మాట్లాడుతున్న ఇప్పటి ఓఎన్జీసీ సంస్థ స్పందించడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం యానాం ప్రాంతంలోని వివిధ గ్రామాల మత్స్య కారులు అంతా  పడవల్లో బయలుదేరి ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఆప్రాంతంలో  ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వందలాది మంది మత్స్యకారులు అక్కడికి చేరుకుని ఇంజన్ పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. ఓ ఎన్ జి సి అధికారులు వచ్చి తమ పరిహారం ఇచ్చే వరకు చమురు సంస్థ కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యానాం పోలీసులు ఎక్కడ పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా నష్టపరిహారం ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకార నాయకులు హెచ్చరించారు.

Previous articleపుట్టా సుధాకర్ యాదవ్ హౌస్ అరెస్ట్
Next articleబయటకు వస్తున్న బాబా లీలలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here