Home తెలంగాణ గ్రామస్థాయి నుండి ఫిట్నెస్ పెంపొందించాలి అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా...

గ్రామస్థాయి నుండి ఫిట్నెస్ పెంపొందించాలి అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

124
0

ఆదిలాబాద్ అక్టోబర్ 5

గ్రామస్థాయి నుంచి క్రీడాకారుల్లో ఫిట్నెస్ పెంపొందించుకోవలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. ఇందుకు గాను గ్రామాల్లో సైతం క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకోవాలని,  దీనికోసం అధికారికంగా తన సహాయకరం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా రన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు తో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం జెండా ఊపి  ఫిట్ ఇండియా 2 కె రన్ ప్రారంభించారు.

అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ ఫిట్నెస్ అనేది ఒక్క రోజు ప్రోగ్రాం కాకుండా ప్రతి రోజు దినచర్యలో ఒక భాగం మార్చుకోవలన్నారు. ఫిట్నెస్ తో పాటు ప్రతి నిత్యం ఆటలను ఆడలన్నారు. ఇందులో కబడ్డీ, కోకో లాంటి పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దీంతో శారీరక శ్రమ పెరుగుతోందన్నారు.

అంతకుముందు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతోందన్నారు.  ప్రతి ఒక్కరూ  ఫిట్నెస్ గా ఉండేందుకు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, పలువురు పీఈటీలు, క్రీడాకారులు,  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Previous articleమహిళా సాధికారతలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Next articleశ్రీశైలం మల్లన్న భక్తుల 17 రోజుల హుండీల లెక్కింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here