సింహాచలం
భారీ వర్షాలు , ఈదురు గాలులవల్ల సింహగిరిపైకి వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసారు. ఘాట్ రోడ్ లో ఒకటి రెండు చోట్ల పడ్డ బండ రాళ్లును తొలగించడమైనది. హనుమాన్ ఆలయం, కొండ పైకి వచ్చే మెట్ల మార్గాలలో నీరు ప్రవహిస్తొంది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు మినహా మిగతావారు స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. సొంత వాహనాలపై వచ్చేవారు జాగ్రత్తగా చూసి నడపాలని అన్నారు. కొండపైన కౌంటర్ లో టికెట్లు అమ్ముతున్నారు. భక్తులు సహకరించాలి. తుఫాను కారణంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని వారన్నారు.