కామారెడ్డి నవంబర్ 03
కామారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారుల తో మాట్లాడారు. చదువు వచ్చిన వారినే కమిటీలో సభ్యులుగా తీసుకోవాలని సూచించారు. 10 నుంచి 15 మంది వరకు సభ్యులను కమిటీ లో నియమించుకోవాలని కోరారు. ఈనెల 5,6వ తేదీలలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అటవీ హక్కుల కమిటీ సభ్యులను పారదర్శకంగా ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు. కమిటీలో 2/3 ఎస్టీలు ఉండాలని చెప్పారు.1/3 మహిళలు ఉండేవిధంగా చూసుకోవాలని తెలిపారు. మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్, జిల్లా లెవల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్హతగల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామ సభలలో ఇకముందు అటవీ భూమి ఆక్రమణకుర్ గురికాకుండా చూసుకుంటామని కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. గ్రామ కమిటీ సభ్యులకు సందేహాలు ఉంటే మండల అటవీ హక్కుల కమిటీకి తెలియజేసి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, ఆర్డివో లు రాజా గౌడ్, శీను, జిల్లా పంచాయతీ అధికారిణి సునంద, జడ్పీ సీఈఓ సాయా గౌడ్ , మండల స్థాయి అధికారులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.