బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టి జయరాములు మంగళవారం స్వయంగా తెలిపారు. ఈనెల 7వ తేదీ తాను నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ తప్పక పోటీ చేస్తుందని గత ఆదివారం కడప లో జరిగిన బిజెపి సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా ప్రకటించారు ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన ఎన్నికల బరి నుండి తప్పుకోవడంతో కొందరు బీజేపీ రంగంలోకి దిగింది పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జయరాములు ఖరారు చేసినట్లు తెలిసింది జయరాములు తో పాటు మరో ముగ్గురు పేర్లు పార్టీ నాయకత్వం అధిష్టానానికి పంపినట్లు సమాచారం వీరిలో మాజీ ఎమ్మెల్యే జయరాములు పేరు ఖరారు కానున్నట్లు సమాచారం ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జయ రాములు తెలిపారు.