చెన్నై సెప్టెంబర్ 9
తమిళనాడులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పుడియపుత్తూరు జరిగింది. ఉదయం 7 గంటల సమయంలో ఓ వ్యాన్ సుమారు 15 మంది కార్మికులను ఎక్కించుకొని ఓ పారిశ్రామిక ఎస్టేట్‌కు వెళ్లేందుకు తూత్తుకుడి వైపు బయలుదేరింది.ఈ క్రమంలో తూత్తుకుడి నుంచి పుతియంపుత్తూరుకు వెళ్తున్న నీళ్ల ట్యాంకర్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాన్ నుజ్జునుజ్జయింది. ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా.. డ్రైవర్‌తో సహా తొమ్మిది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.