Home తెలంగాణ సింగరేణిలో ప్రమాదం..నలుగురు మృతి

సింగరేణిలో ప్రమాదం..నలుగురు మృతి

266
0

మంచిర్యాల
సింగరేణి బొగ్గు గనిలో విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఎస్ఆర్పీ లో ఘోర ప్రమాదం జరిగింది గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. బొగ్గు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. మరో రెండు గంటలు పట్టే అవకాశముందని తోటి కార్మికులు చెబుతున్నారు. క ఈ ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మైన్లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. మృతి చెందిన
మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మైన్లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. మృతి చెందిన కార్మికులు కృష్ణారెడ్డి (60), సూర్య నర్సింహరాజు (30), లక్ష్మయ్య (60), చంద్రశేఖర్ (35) గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు…మృతుడు చంద్రశేఖర్ శవం బయటకు తీశారు. మృతుల కుటుంబాలు, బంధువులు గని వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై గని అధికారులు విచారణ చేపట్టారు. శ్రీరాంపూర్ పోలీసులు సంఘటన జరిగిన గని వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు త్వరగా చేపట్టాలని మృతుల బంధువులు గనిపై ఆందోళన చేస్తున్నారు.

Previous articleఎన్నికల వేళ… వైసీపిలోకి వలసలు… మంత్రి అనీల్ సమక్షంలో చేరికలు
Next articleఘనంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జన్మదిన వేడుకలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here