హైదరాబాద్ సెప్టెంబర్ 28
నగర శివార్లలోని హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. ఇప్పటికే రెండు గేట్లను తెరిచి ఉంచగా, మంగళవారం ఉదయం మరో నాలుగు గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు ఔట్ ఫ్లో, ఇన్ ఫ్లో 4,200 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,763.50 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు.ఉస్మాన్ సాగర్‌కు కూడా వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2 వేల క్యూసెక్కులుగా ఉంది. నిన్న రెండు గేట్లను రెండు ఫీట్ల వరకు తెరువగా, ఇవాళ మూడు ఫీట్ల వరకు లిఫ్ట్ చేశారు. ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1790 అడుగులుగా ఉంది.