లక్నో అక్టోబర్ 25
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ 10 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్స అందిస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హామీల వర్షం కొనసాగుతోంది. తాము అధికారం చేపట్టగానే విద్యార్ధినులకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు అందిస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని పలు హామీలు గుప్పించిన తాజాగా మరో కీలక వాగ్ధానం చేశారు.. కొవిడ్-19 బాధితులకు ఊతంగా బాధిత కుటుంబానికి రూ 25,000 పరిహారం ఇస్తామని ఆమె ఇప్పటికే వెల్లడించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తామనీ ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.