Home తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కి నిధులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కి నిధులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

108
0

జగిత్యాల అక్టోబర్ 27
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆన్నారు.బుధవారం
జగిత్యాల రూరల్ మండల లక్ష్మీ పూర్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో 25 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను,కులాలను గౌరవిస్తూ హిందు దేవాలయాలకు నిధులను ముఖ్యమంత్రి  కేటాయిస్తున్నారని,తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు,ధర్మపురి,వేములవాడ,యాదాద్రి ఆలయాలకు నిధులను ప్రభుత్వం కేటాయించిందని,గత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు అభివృద్ధి కి నోచుకోలేదని అన్నారు.యాదాద్రి లో లక్ష్మీ నరసింహ ఆలయం పునఃనిర్మాణం చాలా గొప్పగా జరుగుతున్నదని పనులు చివరి దశలో ఉన్నాయని వచ్చే సంవత్సరం ప్రారంభించుకుంటున్నామని ముఖ్యమంత్రి  కూడా తెలియజేశారని అన్నారు.లక్ష్మీపూర్ వెంకటేశ్వర ఆలయానికి కూడా నిధులు మంజూరు కు వినతిపత్రాన్ని అందజేశారని తన వంతుగా నిధుల మంజూరుకు కృషిచేస్తానని అన్నారు.బతుకమ్మ,బోనాలు వంటి పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు.

Previous articleకోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించాలి జిల్లా కలెక్టర్ జి.రవి
Next articleభక్తిశ్రద్ధలతో నాతే షరీఫ్ పోటీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here