నల్లగొండ సెప్టెంబర్ 30
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల సహాయక సహకార యూనియన్ చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డిని బోర్డు డైరెక్టర్లు ఎన్నుకున్నారు. హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బోర్డు డైరెక్టర్లు సమావేశమయ్యారు. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో గంగుల కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.అంతకుముందు నార్ముల్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, నూతన బోర్డు డైరెక్టర్ల బృందం నిన్న మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రి వారికి అభినందనలు తెలిపారు.