Home క్రీడలు ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్ గా గంగూలీ

ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్ గా గంగూలీ

318
0

న్యూ ఢిల్లీ నవంబర్ 17
బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీకి  ఐసీసీ ప్రమోషన్ వచ్చింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్ గా గంగూలీ నియమితులయ్యారు. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ

పదవిలో ఉన్న మరో భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ నియామకమయ్యారు. ఇప్పటికే ఆ స్థానం నుంచి కుంబ్లే తప్పుకొన్నారు. మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీకి స్వాగతమంటూ ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే అన్నారు.
క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుభవం ఐసీసీకి ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పారు. గత 9 ఏళ్లుగా ఎనలేని సేవలందించిన కుంబ్లేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లలో పకడ్బందీగా డీఆర్ ఎస్ అమలు అనుమానిత

బౌలింగ్ యాక్షన్ ను గుర్తించేందుకు అధునాతన ప్రక్రియలకు అనిల్ కుంబ్లే శ్రీకారం చుట్టారని కొనియాడారు. అంతేగాకుండా మహిళా క్రికెట్ లోనూ ఫస్ట్ క్లాస్ స్టేటస్ లిస్ట్ ఏ క్లాసిఫికేషన్ కు ఐసీసీ ఆమోదం తెలిపింది. మహిళా క్రికెట్ కు సంబంధించి

కూడా ఐసీసీ విమెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ఆ కమిటీకి వెస్టిండీస్ క్రికెట్ సీఈవో జానీ గ్రేవ్ ను చైర్మన్ గా నియమించింది.2012లో ఈ పదవి చేపట్టిన కుంబ్లే.. 2016 2019 లలో కూడా ఎంపికయ్యాడు. అంతకుముందు ఈ

పదవిలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ ఉండేవాడు. కాగా.. ఇప్పటికే ఐసీసీ టెక్నికల్ కమిటీలో పరిశీలకుడిగా ఉన్న గంగూలీ కి ఇది పదోన్నతే. అయితే భారత జట్టు రూపు రేఖలను మార్చిన కెప్టెన్ గా పేరున్న దాదా 2019 వరకు క్రికెట్

అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా  ఆ తర్వాత 2019 అక్టోబర్ లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.  ఇప్పటికే  ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ..

ఇప్పుడు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఇక తర్వాత గంగూలీ చూపు ఐసీసీ అధ్యక్ష పదవిపైనే అని వాదనలు వినిపిస్తున్నాయి

Previous articleరైతు భరోసా కేంద్రాలు తనిఖీ గ్రామాల్లో ఈ-పంట నమోదు జాబితాను పరిశీలించిన ఏవో సరిత
Next articleఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థితి ..విద్యా సంస్థలను మూసివేత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here