నెల్లూరు
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామం లో సోమవారం తెల్లవారు జామున సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా రెగ్యులేటర్ పైపు కట్ అయి మంటలు చేలరేగాయి. భార్యకు మంటలు అంటుకోగా మంట ఆర్పే ప్రయత్నంలో భర్త కు కూడా మంటలు అంటుకుని సంఘటన స్థలంలోనే వారిద్దరూ మృతి చెందారు. ,వారితో పాటు వున్న 13 ఏళ్ళ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ,ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక కూడా మృతి చెందింది. మృతులు సయ్యద్ అబ్బాస్( 42), సయ్యద్ నౌషాద్ (38), సయ్యద్ అయేషా (13). అక్కడున్న కుక్క అరవడం తో ఇంటి చుట్టు పక్కల వారు మేల్కొని తలుపులు తీసారు. విగతజీవిగా పడి ఉన్న దంపతులు, గాయాలతో మూడో కుమార్తె ను గుర్తించారు. సయ్యద్ అబ్బాస్ కుటుంబం చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని జీవిస్తుంంది. సోమవారం ఉదయం అబ్బాస్ భార్య గ్యాస్ మీద సాంబార్ రెడీ చేస్తుండగా ప్రమాదవశాత్తు రెగ్యులేటర్ పైపు లీక్ అయి తొలుత అబ్బాస్ భార్యకు మంటలు అంటుకోగా ఆర్పే ప్రయత్నం చేసిన అబ్బాస్ కు తర్వాత అక్కడే ఉన్న కూతురుకు మంటలు అంటుకోవడం జరిగిదని పోలీసులు వెల్లడించారు. అది చిన్న రూమ్ కావడం చేత ప్రమాద తీవ్రత పెరిగి సంఘటనా స్థలం లోనే దంపతులు చనిపోయినట్లు పాపని చికిత్స కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పపా కూడా చనిపోవడం జరిగింది. ఈ సంఘటన పై పూర్తి దర్యాప్తు చేస్తామని అన్నారు.