Home ఆంధ్రప్రదేశ్ అనంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…..ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి దీపావళి మరుసటి రోజు ఘోర...

అనంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…..ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి దీపావళి మరుసటి రోజు ఘోర రోడ్డు ప్రమాదం

91
0

అనంతపురం
సంతోషంగా పండగ చేసుకుని మునుపటిలాగే కూలీ పనికెళ్తున్న ఆ ఆరుగురి కుటుంబాల్లో ఓ గుర్తు తెలియని వాహనం యమపాశమై పెనువిషాదాన్ని నింపింది. పామిడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగులు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు,  వాహనదారులు క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ఘటనలో చనిపోయిన వారు, గాయపడిన వారంతా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన వారు. స్థానిక సమాచారం మేరకు పోలీసులుఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని  లారీ ఢీ కొని ఉండొచ్చనిచ  మద్యం మత్తులో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానo. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous articleరైల్వే స్టేషన్ లో పోలీసుల తనిఖీలు
Next articleఆటో బోల్తా…నలుగురికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here