Home తెలంగాణ ప్రియురాలి అందోళన

ప్రియురాలి అందోళన

274
0

మేడ్చల్
మేడ్చల్ జిల్లా . మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్ లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది.  తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఎనిమిది నెలల గర్భవతిని చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని బోడుప్పల్ లోని ప్రియుడు ప్రశాంత్ ఇంటి ముందు దామెర ప్రణీత (19)ఆందోళన చేసింది.  జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీత కు ప్రశాంత్ అయిదు సంవత్సరాల క్రితం పరిచయం అయింది.  పెళ్లి చేసుకుంటానని నమ్మించాడనీ , అనంతరం శ్రీజ అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని ప్రణీత ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని గట్టిగా నిలదీయడంతో ఈనెల మూడున మిర్యాలగూడ తీసుకువెళ్ళి ఒక గదిలో  పెళ్ళి చేసుకున్నాడనీ , తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుండి వచ్చేశాడని అంటోంది.  ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్ ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారనీ అంటోంది.  తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని భీష్మించుకు కూర్చుంది. పోలీసులు ఇరువర్గాలను పీఎస్ కు తరలించారు.

Previous articleమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్ష సిపిఐ నాయకులు
Next articleప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here