చందానగర్
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఒక ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. ఘటనలో ప్రియురాలు మృతి చెందింది. ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ప్రేమించుకున్నారు. నాగ చైతన్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తుంది. కోటిరెడ్డి మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు. ఇద్దరి కులాలు వేరు కావడం తో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. ఈ నేపధ్యంలో వారిద్దరూ హైదరాబాద్ నలగండ్ల లోని ఒక లాడ్జ్ రూము తీసుకున్నారు. రూములో కోటిరెడ్డి ప్రియరాలిని హత్య చేసి, లాడ్జ్ నుండి అదృశ్యమైయాడు. కట్ చేస్తే ఒంగోలు లో ప్రత్యేకమైయాడు. ఒంటి నిండా గాయాలతో ఒంగోలు లో హాస్పిటల్ లో చేరాడు. ఘటన సమాచారం తెలిసిన చందానగర్ పోలీసులు కేసు స్ నమోదు చేసారు. ఒంగోలు లో చికిత్స పొందుతున్న కోటి రెడ్డి నీ అదుపులోకి తీసుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని, ఇద్దరు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కోటిరెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.