జగిత్యాల, అక్టోబర్ 2
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ 1964 సంఘం జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల ఎల్ఐసి ఏజెంట్ల సంఘం అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ ఏజెంట్ల సమస్యల పరిష్కారం తో పాటు సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందని అన్నారు. అనంతరం ధరూర్ క్యాంప్ లోనే భగిని నివేదిత బాలికల ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు.