కోరుట్ల నవంబర్ 10
తెరాస కోరుట్ల మండల ,పట్టణ శాఖ ఆధ్వర్యంలో
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెరస నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్ మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆని ఈ సందర్భంగా కొనియాడారు.ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపు కోవాలన్నారు ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కౌన్సిలర్లు, కో అప్షన్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.