Home తెలంగాణ ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు

ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు

291
0

కోరుట్ల సెప్టెంబర్ 25
పండిట్ దీన్ దయాల్ జయంతి ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా
కోరుట్ల పట్టణంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో గల పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెడిపెల్లి సత్యనారాయణ రావు మరియు కోరుట్ల పట్టణ  అధ్యక్షులు చిరుమల్ల ధనంజయ్, ఇందూరి సత్యం లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మంత్రాలను నిరుపయోగంగా ఉంచకూడదు కానీ అంతకంటే ముందు శ్రామికులు పని లేకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరూ పనిచేసేందుకు తద్వారా సంపాదించుకునేందుకు అవకాశం ఉండాలి అందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం ఆధారంగానే ఆర్థిక శాస్త్ర పరిమితులు తెలుసుకొని మన ఆర్థిక విధానాలను రూపకల్పన చేసుకోవాలి మన వ్యవస్థలో ఆవులు ఎద్దులు ఉమ్మడి కుటుంబం ప్రేమానురాగాలు ప్రకృతి ఆరాధన ముఖ్యమైన అంశం వాటి ప్రాధాన్యాన్ని ఆవశ్యకతను పాశ్చాత్య ఆర్థికశాస్త్రం ఏనాటికీ అర్థం చేసుకో చాలదని తెలిపారు మన దేశానికి జాతీయ విద్యా విధానం అవసరమని ఎప్పుడో చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో కైరం కొండ రాజేశం, మోలుమూరి అలేఖ్య రాజ మురళి, పట్టణ ప్రధాన కార్యదర్శులు పోతుగంటి శ్రీనివాస్, గిన్నెల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కంఠం ఉదయ్ కుమార్ ,మీడియా సెల్ కన్వీనర్ ఇట్యాల నవీన్, ఎర్ర రాజేందర్, రాజేష్ ,రంజిత్ ,నారాయణ రెడ్డి ,తాహిద్, కొక్కుల గంగాధర్, లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.

Previous articleమహాసముద్రం ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌తో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది – పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్
Next articleప్రతిపక్షాలవి ఉద్దెర మాటలు : స్పీకర్‌ పోచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here