పెద్దపల్లి సెప్టెంబర్ 23
అర్జీ 1 ఏరియా జిఎం కె.నారాయణ జి.డి.కె 11ఇంక్లైన్ గనిలో ప్రవేశపెట్టిన రెండొవ కంటిన్యూయూస్ మైనర్ మర్చింగ్ పనులు ఉత్పత్తి ప్రారంభించే ప్రదేశం అయిన 3సీమ్ లో ని బ్లాక్ -A పనిస్థలాలు, సేఫ్టీ చర్యలను, ఉత్పత్తి ప్రారంభంచే ప్రదేశంలోని ముందస్తు చర్యలను గురువారం పరిశీలించారు. ఉత్పత్తి సమయంలో రక్షణ చర్యలను తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమార్ జనరల్ మేనేజర్ యూజీ మైన్స్ కార్పొరేట్, చక్రపాణి ఢీజీఎం ఈ అండ్ ఎం పరిశీలించి తగు చర్యలను, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ పరిశీలన కార్యక్రమములో రమణ మూర్తి ఏరియా ఇంజనీర్, గని ఏజెంట్ శ్రీనివాస్, రాందాస్ గ్రూప్ ఇంజనీర్, గని మేనేజర్ నెహ్రు, గని ఫిట్ ఇంజనీర్ ఓదెలు, ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.