కామారెడ్డి నవంబర్ 16
కామారెడ్డి గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోవులను రక్షించి గోవధను
నిర్మూలించి,
గోవును దేశ
జాతీయ ప్రాణి గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ కి విజ్ఞాపన పత్రం ఇచ్చుటకు హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం
నుండి ఢిల్లీకి పాదయాత్ర
చేయుచున్నారు. అందులో అయ్యప్పస్వామి మాల
ధరించిన స్వాములు ఢిల్లీకి బయలుదేరినారు. వీరికి కామారెడ్డి అయ్యప్ప సేవా సంఘం మరియు అయ్యప్ప అన్నప్రసాదం సేవాసమితి వారికి స్వాగతం పలికి అల్పాహారం అందజేశారు. ఈ
సందర్భంగా యాత్ర దిగ్విజయం
కావాలని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ప్రభాకర్, అయ్యప్ప
అన్నప్రసాద సేవాసమితి అధ్యక్షులు గందె శ్రీనివాస్ బొందుగుల
లక్ష్మీకాంతం,పి.లక్ష్మణ్,
గొనే శ్రీనివాస్, కూర శ్రీనివాస్, యాద అంజయ్య, భరత్, చందు,ప్రేమ్, శివ తదితరులు పాల్గొన్నారు.