చిత్తూరు
దక్షిణ కాశీ గా పేరుపొందిన కాళహస్తీశ్వర ఆలయానికి తిరుపతి వాస్తవ్యులు వజ్రాల చంద్రబాబు, లక్ష్మీనారాయణ దంపతులు బంగారు వడ్డాణం ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. పెద్దిరాజు కు అందించారు. అనంతరం ఈవో పెద్దిరాజు ఆదేశాలతో విరాళం అందించిన దాతలకు స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ ఏఈవో తనపాల్, విజయ సారది ఆలయ ప్రోటోకాల్ సూపరిండెంట్ నాగభూషణం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.