న్యూఢిల్లీ సెప్టెంబర్ 29
తన మలాశయంలో బంగారం పేస్ట్ ను దాచిన ఓ వ్యక్తిని ఇంపాల్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. కేరళలోని కోచికోడ్‌కు చెందిన అతను ఇంపాల్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. తనిఖీ సమయంలో వేసిన ప్రశ్నలకు అతను సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్‌లో అతనికి ఎక్స్ రే తీశారు. ఎక్స్ రే రిపోర్ట్ ప్రకారం అతని శరీర మలాశయ భాగంలో లోహం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.సుమారు 900 గ్రాముల గోల్డ్ పేస్ట్‌ను ఆ వ్యక్తి తన మలాశయంలో దాచినట్లు అధికారులు గుర్తించారు. ఆ గోల్డ్ పేస్ట్ విలువ సుమారు 42 లక్షలు ఉంటుందని సీఐఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం నాలుగు గోల్డ్ పేస్ట్ ప్యాకెట్లు ఉన్నాయని, వాటి బరువు 90.68 గ్రాములు ఉంటుందని సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బీ దిల్లి తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రిస్కింగ్ చేస్తున్న సమయంలో మలాశయం వద్ద మెటల్ ఉన్నట్లు గుర్తించామని, మొహమ్మద్ షరీఫ్ అనే ప్యాసింజెర్‌ను ఈ కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ ప్యాసింజెర్ గోల్డ్ పేస్ట్ ఉన్నట్లు అంగీకరించాడు.