చిత్తూరు
శ్రీకాళహస్తి పట్టణంలోన ఆరవ వ వార్డులో ఎమ్మెల్యే మధుసుధన్ రెడ్డి బుధవారం పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారదిశగా ఆదేశాలు జారీచేసి, వెనువెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను అయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,శ్రీకాళహస్తి పట్టణంలోని 6వార్డు ప్రజలు వారి సమస్యలను తెలియజేశారని, ముఖ్యంగా చిన్న పార్టీ రోడ్డు మరమ్మతులు, ఇంటికి దగ్గరలో కరెంట్ పోల్స్ ఉండడం మరియు త్రాగునీటి కొలయలు సమస్యలు తెలియజేశారు.అలాగే త్వరలోనే 17 కోట్ల రూపాయలతో శివం టు శివం 40 అడుగులరోడ్డు ఏర్పాటు చేసి ప్రజాసమస్యలు తీరుస్తామని తెలియజేశారు.